Keerthy Suresh: పెళ్లికి ముందే ఆ పనికానిచ్చాం..!.. తన ప్రేమ గురించి షాకింగ్ విషయాలను బైట పెట్టిన కీర్తిసురేష్..
కీర్తిసురేష్, ఆంటోనీ తట్టిల్ ల పెళ్లి గోవాలో ఎంతో గ్రాండ్ గా జరిగింది. డిసెంబరు 12న వీరి పెళ్లి జరిగింది. అదే విధంగా ఆంటోనీ తట్టిల్, కీర్తిసురేష్ ల పెళ్లి హిందు, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగినట్లు తెలుస్తొంది.
అయితే.. నటి కీర్తిసురేష్ తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యిందో ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు తెలుస్తొంది. ఆంటోనీ తట్టిల్, కీర్తి సురేష్ ల మధ్య 15 ఏళ్ల పాటు ప్రేమ సాగినట్లు తెలుస్తొంది.
వీరిద్దరు ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నారంట. 2010 లో ఫస్ట్ టైమ్.. ఆంటోనీ తట్టిల్ ప్రపోజ్ చేశాడని నటి చెప్పుకొచ్చింది. అదే విధంగా ఒకసారి వీరి ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లామని, అక్కడికి ఆంటోనీ వచ్చాడని చెప్పింది.
అయితే.. అందరి కళ్లు కప్పి.. సీక్రెట్ గా మరో చోటకు వెళ్లారంట. అయితే.. ఆంటోనీ తట్టిల్ తనకన్న ఏడేళ్లు పెద్దవాడని, గతంలోనే ప్రామిస్ రింగ్ సైతం తోడిగాడని కూడా చెప్పేసింది.
ఆంటోనీ తట్టిల్ ఖత్తర్ లో పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ మధ్య ఉన్న లవ్ విషయం.. సామ్, విజయ్, అట్లీ, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మిలకు మాత్రమే తెలుసన్నారు కీర్తిసురేష్. అదే విధంగా.. 2017లో ఫారెన్ టూర్ కూడా వేశామని చెప్పారు.
2022 నుంచి పెళ్లి అనుకుంటున్నామని.. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని.. కీర్తిసురేష్ తెలిపారు. అదే విధంగా తన పసుపు తాడు గురించి మాట్లాడుతూ..అది చాలా శక్తివంతమైందని, పవిత్రమైందని.. జనవరి చివరలో మంచి రోజులున్నాయని.. అప్పుడు బంగారం మంగళసూత్రం ధరిస్తానని కూడా నటి కీర్తిసురేష్ చెప్పినట్లు తెలుస్తొంది.