Keerthy Suresh: పట్టుచీరలో కీర్తిసురేష్.. సొగసు చూడతరమా..

Mon, 08 Jan 2024-8:46 pm,

Keerthi Suresh Pics: రామ్ హీరోగా చేసిన నేను శైలజ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.

మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు.. తమిళ భాషలలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో అలానే చిన్న హీరోలతో.. జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ.

కాగా కీర్తి సురేష్ కి మరిచిపోలేని పేరు తెచ్చిపెట్టింది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కనిపించింది కీర్తి సురేష్.

మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రానికి గాను నంది అవార్డు సైతం అందుకుంది ఈ హీరోయిన్. ఈ సినిమా అప్పట్లో కీర్తి సురేష్ కి ఎన్నో ప్రశంసలు కూడా తెచ్చి పెట్టింది.

కాగా మహానటి తర్వాత దాదాపు తొమ్మిది ఫ్లాపులు ఈ హీరోయిన్ ని పలకరించాయి. అయినా ఏమాత్రం తగ్గకుండా గత సంవత్సరం నాని దసరా సినిమాలో వెన్నెలగా కనిపించి సూపర్ హిట్ అందుకుంది.

ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తన సోషల్ మీడియాలో పట్టుచీరలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లూ చీరలో పద్ధతిగా కనిపిస్తూ.. మల్లెపూలు పెట్టుకొని కీర్తి సురేష్ ఇచ్చిన ఫోజులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫోటోలను చూసి కీర్తి సురేష్ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ చీరలో కీర్తి సురేష్ చూడ చక్కని చందమామలా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link