Kerala Lottery: అదృష్టమంటే అలాగుండాలి మరి, 11 మంది 250 రూపాయలు పోగుచేసుకుని టికెట్ కొంటే 10 కోట్ల లాటరీ

Sun, 30 Jul 2023-1:12 am,

వాస్తవానికి గత ఏడాది కూడా ఈ 11 మంది మహిళలు డబ్బులు పోగుచేసుకుని ఓనమ్ బంపర్ టికెట్ కొన్నారు. అప్పుడు వీరికి 7500 రూపాయలు వచ్చాయి. అందరూ సమానంగా ఈ డబ్బులు పంచుకున్నారు. అందుకే ఈసారి మాన్సూన్ బంపర్ టికెట్ కొనాలన్పించిందంటున్నారు

ఈ 11 మందిలో చాలామంది మహిళలకు రుణాలున్నాయి. కుమార్తెల పెళ్లి చేయాల్సి ఉంది. కుటుంబీకుల చికిత్స ఖర్చులున్నాయి. చిన్న చిన్న ఇళ్లలో నివసించే ఈ కార్మికులంతా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నవాళ్లే.  

మలప్పురం కార్పొరేషన్ కు చెందిన హరిత కర్మ సేనలో ఈ మహిళలు పనిచేస్తుంటారు. ఈసారి తమకు అదృష్టం వరించిందని ఆనందపడుతున్నారు.   

ఈ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు జీతం 7500 రూపాయల్నించి 14 వేల వరకూ అందుతుంది. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తుంటారు.   

లాటరీ తగిలిందని తెలియగానే ఆ మహిళల ఆనందానికి అంతు లేకుండా పోయింది. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈ డబ్బులతో పరిష్కరించుకుంటామంటున్నారు.  

ఆ మహిళలు కొనుగోలు చేసిన టికెట్‌కు 10 కోట్లు లాటరీ వచ్చినట్టు కేరళ లాటరీ విభాగం ప్రకటించింది. 250 రూపాయల లాటరీ టికెట్ కొనేందుకు ఆ మహిళల వద్ద అంత డబ్బు లేకపోతే 11 మంది కలిసి కొనుగోలు చేశారు.

కేరళ స్టేట్ లాటరీకు చెందిన ఆ టికెట్ ఖరీదు 250 రూపాయలు. ఆ పారిశుద్ధ్య మహిళా కార్మికులు మలప్పురం కార్పొరేషన్‌లో పనిచేసేవాళ్లు.

అదృష్టం ఒక్కోసారి అందర్నీ బలంగా తడుతుంది. ఒక్కోసారి కొందరినే వరిస్తుంటుంది. కేరళ రాష్ట్రంలో 11 మంది పారిశుద్ధ్య మహిళా కార్మికులు కలిసి కేరళలో 250 రూపాయలు పోగు చేసుకుని లాటరీ టికెట్ కొన్నారు. ఈ లాటరీ ఆ మహిళలకు 10 కోట్ల జాక్ పాట్ అందించింది. ఈ టికెట్ కోసం ఒక్కొక్కరు 25 రూపాయల కంటే తక్కువే ఇవ్వడం విశేషం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link