Ketika Sharma Images: పద్దతిగా ముస్తాబయిన కేతిక శర్మ.. అచ్చు తెలుగమ్మాయిలా మెరిసిపోతున్న ఢిల్లీ భామ!

Thu, 06 Oct 2022-8:59 pm,

కేతిక శర్మ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఎప్పుడూ చిట్టిపొట్టి డ్రెస్సులో దర్శనమిచ్చే కేతిక.. ఈసారి చాలా పద్దతిగా ముస్తాబయ్యారు. మోడ్రన్ డ్రెస్సులో అచ్చు తెలుగమ్మాయిలా మెరిసిపోతున్నారు.   

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ.. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కేతిక పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.    

మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలో కేతిక శర్మ నటించారు. ఈ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కేతిక ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.  

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక హీరోయిన్‌గా చేశారు.    

మాస్ పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో కేతిక శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.     

1995 డిసెంబరు 25న ఢిల్లీలో కేతిక శర్మ జన్మించారు. మార్టినీర్స్ పాఠశాలలో 10th పూర్తి చేసిన కేతిక.. ఢిల్లీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link