Telangana: తెలంగాణ పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పు.. గ్రేడింగ్‌కు స్వస్తి..!
తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష విధానంలో ప్రభుత్వం కీలక మార్పుల చేసింది. ఇప్పటి వరకు అమలు చేస్తోన్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ.
సాధారణంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఇప్పటి వరకు 80 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. 20 మార్కులు ఇంటర్నల్‌గా వేసేవారు. అయితే, ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారు.
ఇకపై 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 12 పేజీల బుక్‌లెట్‌ను సైన్స్, బయాలజీకి అందజేయనున్నారు. ఇంటర్నల్ మార్కుల విధానంలో పారదర్శక కొరవడిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దోస్త్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతుంది. ఈ పదో తరగతి మార్కుల ఆధారంగా ఇంటర్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. మెరీట్ ఆధారంగానే అడ్మిషన్లు కూడా జరుగుతాయి.
గతంలో ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులు నిర్ణయించేంది. వీటికి బదులు ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్కులే ఇవ్వాలని నిర్ణయించింది. 2025 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది.