Khairatabad 2024: అన్నిరికార్డులు బ్రేక్ చేసిన బడాగణేష్.. ఈసారి ఖైరతాబాద్ గణపయ్యకు వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా..?

Mon, 16 Sep 2024-7:54 pm,

 దేశమంతాట ఎక్కడ చూసిన  కూడా గణపయ్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రుల్లో చిన్నా, పెద్దా తేడాలేకుండా గణపయ్యలకు ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటన్నారు. ప్రత్యేకంగా మండపాలలలో కుంకుమార్చనలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లో కూడా గణపయ్య వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరుగుతాయి. ఈసారి ఖైరతాబాద్ గణపయ్య చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఖైరతాబాద్ గణేష్ ఏర్పాటు చేసి 70 ఏళ్లు పూర్తయింది. అందుకే ఈసారి 70 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా.. సప్త ముఖాలతో గణపయ్యను ఏర్పాటు చేసిన, ప్రత్యేక ఆకర్శణగా విగ్రహాంకు తుదిరూపుఇచ్చారు. ఈక్రమంలో హైదరాబాద్ లోని ప్రజలకే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ గణపయ్యను చూసేందుకు భారీ ఎత్తున జనాలు వస్తుంటారు. దీంతో ఈసారి గణపయ్య దగ్గర మొదటి నుంచి రద్దీ నెలకొందని చెప్పుకొవచ్చు.

ఇదిలా ఉండగా.. ఈసారి సెప్టెంబర్ 7 న వినాయకచవితి, సెప్టెంబర్ 17 న నిమజ్జనం వేడుకలను నిర్వహిస్తున్నారు. దాదాపు.. ఏడు అంకె కూడా అన్నింటిలో హైలేట్ గా నిలిచింది. అందుకే ఖైరతాబాద్ గణేష్ ను సప్తముఖ వినాయకుడిరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చేలా రూపొందించారు.. ముఖ్యంగా ఈసారి శనివారం, ఆదివారం విపరీతంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతంలో రద్దీ నెలకొందని చెప్పుకొవచ్చు.

ఈ క్రమంలో ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం 70 లక్షల ఆదాయం భక్తుల డొనెషన్ ల ద్వారా సమకూరిందని తెలుస్తోంది. అదే విధంగా.. హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో 40 లక్షలు సమకూరినట్టు కూడా తెలుస్తోంది.   

ఇదిలా ఉండగా.. మరోవైపు ఈరోజు ఖైరతాబాద్ గణపయ్య మండపం కర్ర తొలిగింపు ప్రారంభించారు. వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా..భక్తుల దర్శనాలు నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజల తర్వాత మహాగణపతి శోభాయాత్ర స్టార్ట్ అవుతుందని తెలుస్తొంది. మధ్యాహ్నం  1 గంటలకు  మహాగణపతి నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link