Kiara Advani: గ్లామర్ విషయంలో ఎక్కడ తగ్గేదేలే అంటున్న కియారా అద్వానీ.. పెళ్లైనా తగ్గని అమ్మడి దూకుడు..
తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో విఫలమైంది.
త్వరలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతుంది. ఇందులో కియారా పాత్రకు మంచి ప్రాధాన్యతే ఉందట. హీరోతో సరిసమానమైన పాత్రలో అలరించబోతుంది.
కియారా కెరీర్ పీక్స్ లో ఉండగానే.. తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. వీరి వివాహాం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలెస్ లో జరిగింది.
కియారా అద్వానీ 2014లో బాలీవుడ్ మూవీ ‘ఫగ్లీ’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ. అప్పటికే అలియా భట్ హీరోయిన్ గా ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకుంది.
ఇక ఎం.ఎస్.ధోని జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ అన్ టోల్డ్ స్టోరీ మూవీతో బాలీవుడ్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. సినిమాల్లోనే కాకుండా.. లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అప్పట్లో కియారా పూర్తి నగ్నంగా చేసిన ఫోటో షూట్ పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. ఇక హిందీలో అక్షయ్ కుమార్ తో ‘లక్ష్మీ’తో పాటు ‘భూల్ భులయ్యా 2’, జుగ్ జుగ్ జియో, సత్య్ కీ ప్రేమ్ కథ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. మొత్తంగా పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తూ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతూనే ఉంది.