Kitchen Tips: టమాటతో మాడిపోయిన వంట పాత్రలు తళతళ.. ఇలా చేయండి
Kitchen Tips: సులభమైన చిట్కాలు || మాడిపోయిన పాత్రలు కడగాలంటే కండలు కరిగించుకోనవసరం లేదు. వంట పాత్రల శుభ్రత కోసం కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే శ్రమ లేకుండానే పాత్రలు తళతళమెరుస్తాయి.
Kitchen Tips: టమాటో సాస్ || టమాటో సాస్ పాత్రల మాడును తొలగిస్తుంది. ముందుగా మాడిపోయిన ప్రాంతంలో టమాటో సాస్ వేయండి. టమాటాల్లో ఉన్న యాసిడ్ మరకలను కరిగేలా చేస్తుంది. టమాటో వేసి ఆరబెట్టాలి. ఒకరోజు తర్వాత ఆ గిన్నెను శుభ్రం చేస్తే మరకలు తొలగిపోతాయి.
Kitchen Tips: నిమ్మరసం || మొండి మరకలను తొలగించడానికి నిమ్మకాయ చక్కగా పని చేస్తుంది. నాన్ స్టిక్ పాత్రలకు నిమ్మకాయ ఉపయోగపడుతుంది. మరకలు ఉన్న చోట కోసిన నిమ్మకాయను రుద్దండి. నిమ్మకాయ రుద్దిన అర్ధగంట లేదా గంట తర్వాత సబ్బుతో కడిగితే మరకలు పోతాయి. ఇది స్టెయిన్ లెస్ పాత్రలను కూడా ఇదే విధంగా చేస్తుంది.
Kitchen Tips: మద్యం || మద్యంతో కూడా పాత్రల మాడును తొలగించవచ్చు. మాడిపోయిన ప్రాంతంలో మద్యం కొంచెం పోసి ఉంచాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం కడిగితే సులభంగా మరకలు కరిగిపోతాయి.
Kitchen Tips: బేకింగ్ సోడా, ఉప్పు || సోడా, ఉప్పులు కూడా మొండి మరకలు తొలగిస్తాయి. స్క్రబ్‌పై సోడా, ఉప్పు చల్లితో పాత్రలను తోమాలి. లేదా వంట సోడాను కొన్ని నీళ్లు వేస పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. కొన్ని నిమిషాలు మరకల గిన్నెలను ఉంచాలి. అనంతరం కడిగితే మీకు మరకలు కనిపించవు.
Kitchen Tips: వేడినీరు || మాడిపోయిన పాత్ర ఉంటే ఆ పాత్రలో నిండా నీళ్లు నింపి పొయ్యిపై ఉంచాలి. ఆ నీళ్లు బాగా మరిగించాలి. తరవాత ఆ నీటిలో కొంత ఉప్పు, నిమ్మరసం, మీరు పాత్రలు కడిగేందుకు వాడే సబ్బు లేదా లిక్విడ్ పోయాలి. మళ్లీ కొంతసేపు ఆ నీటిని మరిగించాలి. అనంతరం శుభ్రం చేస్తే మాడిపోయిన ప్రాంతం శుభ్రమవుతుంది.