Kitchen vastu: మీ ఇంటి వంటగది కిటికీ ఈ దిశలో ఉందా? మీకు కష్టాల సుడిగుండమే..!
వాస్తు ప్రకారం ఇంటి కిటికీకి కూడా ఒక దిశ ఉంటుంది. దీన్ని ఆ విధంగానే ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా మనం ఇంటి కిచెన్లో స్టవ్, సింక్, కిటికీ దిశకు ప్రాధాన్యత ఉంది. కిటికీ కిచెన్లో ఏ దిశలో ఉండాలో తెలుసుకుందాం.
అయితే, వాస్తు ప్రకారం ఇంటి వంటగదిలో కిటికీ తూర్పు వైపు ఉండాలి. ఎందుకంటే ఈ దిశలో సూర్యోదయం అవుతుంది. అలాగే వంట చేసిన తూర్పు దిశగా నిలబడి వండాలి అంటారు. ఇది పవిత్రమైన దిశగా పరిగణించబడుతుంది.ఈ దిశలో కిటికీ ఉండటం వల్ల సానుకూల శక్తి , ఆరోగ్యం, శ్రేయస్సు వస్తుంది.
అంతేకాదు వాస్తు ప్రకారం ఇంటి కిచెన్ కిటికీ ఈశాన్య దిశలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశలో కిటికీ ఉండటం వల్ల ఆ ఇంట్లో సుఖఃశాంతులు, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారి జీవితంలో ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది.
వాస్తు ప్రకారం ఇంటి వంటగదిని కేవలం ఆగ్నేయ మూలలోనే ఏర్పాటు చేసుకుంటాం. అయితే, వంటగదిలో కిటకీ ఆగ్నేయ దిశలో కూడా ఉంచవచ్చు . ఇది శ్రేయస్సు ,విజయానికి దారితీస్తుంది.
వంటగదిలోని కిటికీ దిశ వాస్తు ప్రకారం వాయువ్య దిశలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశలో ఉంటే వ్యాపారం పుంజుకుంటుంది. ఆ ఇంట్లో ధనాకర్షణ కూడా పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)