Kolkata murder case: కోల్ కతా కన్నీటి ఘటనకు ‘నెలరోజులు’.. 25 దేశాలు, 130 నగరాల్లో నిరసనలు.. మమతా సర్కారు ఏంచేసిందంటే..?

Mon, 09 Sep 2024-10:41 am,

కోల్ కతా ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. ఆగస్టు 9 న తెల్లవారు జామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు అప్పుడే నెలరోజులు గడిచిపోయింది. ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్ హాల్ లో.. ట్రైనీ డాక్టర్ విగత జీవిగా కన్పించింది. యువతి శరీరమంతా రక్తంతో నిండిపోయి, శరీరంపై ఎలాంటి ఆఛ్చాదన కూడా లేనిపరిస్థితిలో యువతి చనిపోయి ఉంది.

ఈ ఘటన వెలుగులోకి  రాగానే.. కోల్ కతా తో పాటు.. దేశమంతా అగ్గిరాజేసింది. దీంతో కోల్ కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తొలుత ఆస్పత్రి వర్గాలు యువతి తల్లిదండ్రులకు .. పలు మార్లు కాల్స్ చేసి, ఒక సారి ట్రైనీడాక్టర్ హెల్త్ బాగోలేదని , మరోసారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని, ఇంకొసారి.. ట్రైనీ డాక్టర్.. చనిపోయిందని ఇలా పలు రకాలుగా చెప్పినట్లు తెలుస్తోంది.

యువతి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అప్పట్లో సంచలన విషయాలు వెల్లడించారు.  యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందని, ఆమె శరీరంలో భారీగా వీర్యం కూడా.. ఉన్నట్లు కూడా తెలిపాయి. ఆమె అంతర్గత అవయవాలు, గొంతు ఎముక పూర్తిగా అంతర్గంతంగా డ్యామెజ్ అయినట్లు కూడా నాలుగు పేజీల పోస్ట్ మార్టం రిపోర్టును బహిర్గతం చేశాయి.  

మరోవైపు కోల్ కతా ఘటన వెలుగులోకి రాగానే.. కొంత మంది దుండగులు ఆస్పత్రిలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశాయి. ముఖ్యంగా అత్యంత జాగ్రత్తగా ఉంచాల్సిన క్రైమ్ జరిగిన ప్రదేశాన్ని మమతా సర్కారు, పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా.. యువతి చనిపోయిన ప్రదేశంలో.. సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఇయర్ ఫోన్స్ దొరకడంతో.. అతడ్ని తొలుత పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై దేశమంతాట నిసనలు వెల్లువెత్తడంతో.. దీనిపై కోల్ కతా కోర్టు సీబీఐకు అప్పగించింది. ఏకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు లేని విధంగా ట్రైనీ డాక్టర్ ఘటనకుఒక రోజు దేశ వ్యాప్తంగా బంద్ ను ప్రకటించి, తమ నిరసన సైతం తెలిపింది. అంతేకాకుండా.. పలుమార్లు పీఎం మోదీకి సైతం ఐఎంఏ లేఖను రాశారు. 

ఇక దేశంలో ఆందోళనలను మిన్నంటాయి. ఎక్కడ చూసిన జూనియర్ వైద్యులు.. రోడ్ల మీదకు వచ్చి తమ నిరపనలు వ్యక్తం చేశారు. దీంతో ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. అంతేకాకుండా.. కోల్ కతా ఘటన జరిగిన తర్వాత కోల్ కతా పోలీసులు, మమతా తీసుకున్న చర్యలపై సీరియస్ అయ్యింది. సీబీఐకు దర్యాప్తు వివరాలను తమ ముందు ఉంచాలని కూడా ఆదేశించింది.  

సీబీఐ.. ఘటన జరిగిన తర్వాత.. క్రైమ్ ప్లేస్ ను జాగ్రత్తంగా ఉంచడంతో.. మమతా సర్కారు పూర్తిగా విఫలమైందని చెప్పింది. అంతేకాకుండా.. ఎవిడెన్స్ ను సైతం తారుమారు చేశారని, ఘటన తర్వాత.. సెమినార్ హాల్ లో సింక్ లను మరమ్మత్తులు చేయడం వంటివి, కొన్ని పనులు చేశారని కూడా చెప్పుకొచ్చింది. దీంతో మమతా సర్కారు కూడా దీనిపై కౌంటర్ ఇచ్చింది. కోల్ కతాలో విద్యార్థులు బైటకు రాకుండా.. మమతా సర్కారు కఠినమైన ఆదేశాలు సైతం జారీ చేసింది.

కోల్ కతా ఘటనపై కొన్ని విద్యార్థి సంఘాలు బహిరంగంగా తమ నిరసనలు తెలిపాయి. హుబ్లీ బ్రిడ్జి వద్ద జరిగిన నిరసనల్లో .. పోలీసులు రెచ్చిపోయారు. విద్యార్థులపై, జూనియర్ డాక్టర్లపై భాష్పవాయువు, వాటర్ కెన్ లతో దాడులు చేశారు. దీనిపై కూడా కోల్ కతా కోర్టు సీరియస్ అయ్యింది. కోల్ కతా ఘటనపై.. నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. అతనికి సపోర్ట్ చేయగా.. మరోవైపు అతని మాజీ అత్త మాత్రం.. తన కూతురును సంజయ్ రాయ్ దారుణంగా హింసించాడని కూడా చెప్పుకొచ్చింది. 

సీబీఐ పోలీసులు సంజయ్ రాయ్ తోపాటు,మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరికి పాలీగ్రాఫ్ టెస్టులు సైతం చేశారు. సంజయ్ రాయ్ ఈ టెస్టులలో షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అశ్లీల వీడియోలు, నగ్న వీడియోలు చూసే అలవాటు ఉన్నట్లు బైటపడింది. ఘటనకు ఒక రోజు ముందు.. సంజయ్ రాయ్.. ట్రైనీ డాక్టర్ ను ఫాలో అవుతున్న వీడీయో కూడ వార్తలో నిలిచింది. ఈ క్రమంలో ఇటీవల ఆర్జీకర్ ఆస్పత్రి ప్రిన్స్ పాల్ సంజయ్ ఘోష్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.  

ఈ ఘటనపై మోదీ ఆగస్టు 15 న ఎర్రకోట నుంచి, దేశ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, అనేక పార్టీలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశాయి. పార్టీల కతీతంగా అందరు దీన్ని ఖండించారు. టీఎంసీ కి చెందిన కొంతమంది నేతలు మమతా తీరును తప్పుపట్టాడు. ఒక ఎంపీ సైతం రాజీనామా చేశాడు. మనదేశంలోనే కాకుండా...జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్ , సింగపూర్, యూరోపియన్ వంటి 25 దేశాలు, 130 నగరాల్లో నిరసలను జరిగాయి. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరుగుతున్న నేపథ్యంలో దేశమంతట ఈ ఘటనపై మాత్రం టెన్షన్ తో ఉన్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link