Krithi Shetty: కాటుక కళ్ళతో కవ్విస్తున్న బేబమ్మ.. చూపు తిప్పుకోలేని అందంతో..!

Mon, 14 Oct 2024-12:53 pm,

మొదటి సినిమా ఉప్పెన తోనే భారీ విజయం అందుకున్న కృతి శెట్టి..తర్వాత చాలా సినిమాలలో నటించి డిజాస్టర్ చవిచూసింది. ఇక ఈమె చివరిగా శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంది. కానీ ఆ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. 

దీంతో ఇండస్ట్రీకి దూరమవుతుందని అందరూ అనుకున్నారు.  కానీ తాజాగా ఈమెకు జాతి రత్నాలు దర్శకుడు కె.వి అనుదీప్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అభిమానులకు చేరువ అవ్వడానికి ఎప్పటికప్పుడు పలు రకాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  నవరాత్రి,  దసరా పండుగలను పురస్కరించుకొని గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

చీర కట్టులో అందరిని ఆకట్టుకుంది. కాటుక కళ్ళతో కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కృతి శెట్టి కి డైరెక్టర్ అనుదీప్ ఎటువంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి. మరొకవైపు బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది కృతి శెట్టి. మరి ఏ మేరకు అక్కడ అవకాశాలు తెలుపుతడతాయో చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link