Kriti Sanon: మరోసారి హాట్ లుక్స్ తో ఫిదా చేస్తోన్న కృతి సనన్ .. అదుర్స్ అనిపిస్తున్న సీతమ్మ అందాలు..
ఢిల్లీలో పుట్టి పెరిగిన కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు సరసన ‘నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్యకు జోడిగా దోచెయ్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.
ఆ తర్వాత తెలుగు హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీలో యాక్ట్ చేసింది. మొత్తంగా కృతి సనన్ తెలుగులో హీరోల పాలిట ఐరన్ లెగ్ గా మారిందనే కామెంట్స్ వినిపించాయి. టాలీవుడ్ హీరోలతో నటించిన సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ఏవి వర్కౌట్ కాలేదు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా కృతికి ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో కథానాయికగా నంబర్ వన్ కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది.
కృతి సనన్.. తెలుగులో మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నేనొక్కడినే' వన్ చిత్రంతో కథానాయికగా పరిచయం అయింది.
కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైమ్ లోనే 2021 యేడాదికి గాను నేషనల్ అవార్డు విన్నర్ గా నిలిచింది కృతి సనన్. కృతి సనన్.. లాస్ట్ ఇయర్ ముంబైలోని బాంద్రాలో రూ.35 కోట్లతో 4 BHK అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటుంది.