Krithi Shetty: ప్రియమైన వాడికి ముద్దు పెడుతూ.. కెమెరాలకు చిక్కిన కృతి శెట్టి..
ఉప్పెన, 'శ్యామ్ సింగరాయ్', బంగార్రాజు వంటి వరుస సక్సెస్ లతో హాట్రిక్ హిట్స్ అందుకొని టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అయింది కృతి శెట్టి. ఆ తర్వాత ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.
హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ ఫ్లాపులు కృతి శెట్టి కెరీర్‌ను డౌన్ ఫాల్ అయ్యేలా చేసింది. దీంతో ఇపుడు వరుసగా హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.
మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన'మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి శెట్టి. అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది బేబమ్మ.
కెరీర్ మొదట్లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్స్‌తో హాట్రిక్ భామ అనిపించుకుంది.
ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
తాజాగా ‘మనమే’ సినిమాలో కనిపించింది. తాజాగా తన పెంపుడు కుక్కను ముద్దాడుతూ దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది. దానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు చిత్రాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. త్వరలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.