KTR School: అమ్మమ్మ ఊరిలో కేటీఆర్‌ సందడి.. అవ్వతాతను తలచుకుని భావోద్వేగం

Thu, 26 Sep 2024-4:27 pm,

బాల్య జ్ఞాపకాల్లో: అమ్మమ్మ ఊరిలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సందడి చేశారు.

తల్లి గారి ఊరు: తన తల్లి కల్వకుంట్ల శోభమ్మ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక. కేటీఆర్‌కు తన అమ్మమ్మతాత జోగినపల్లి లక్ష్మీ - కేశవరావు అంటే ఎంతో ప్రేమాప్యాయతలు ఉండేవి.

సెలవుల్లో ఇక్కడే: చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య వద్ద కేటీఆర్‌ పెరిగారు. సెలవులు వస్తే అమ్మమ్మ ఊరికి వచ్చి వాలిపోయేవారు.

సొంత నిధులతో: ఎన్నో జ్ఞాపకాలు ఉన్న అమ్మమ్మ ఊరు కొదురుపాకలో తన అమ్మమ్మతాతల జ్ఞాపకార్థం కేటీఆర్‌ తన సొంత నిధులతో పాఠశాల భవనం నిర్మించారు.

రాజభవనంలా: కార్పొరేట్‌కు దీటుగా ఆధునాతన సౌకర్యాలతో కేటీఆర్‌  రెండు ఫ్లోర్లలో 18 తరగతి గదులు నిర్మించారు. అంతేకాకుండా వంట గదితోపాటు మధ్యాహ్నం భోజనం కోసం డైనింగ్‌ హాల్‌, కంప్యూటర్‌ శిక్షణ కోసం గదులు, చుట్టూ ప్రహరీ గోడను నిర్మించారు.

తాతఅవ్వపై ప్రేమ: అత్యాధునిక సౌకర్యాలతో తయారైన ఈ భవనాన్ని కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మమ్మ ఊరితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

బ్యాగులు అందజేత: ఈ సందర్భంగా పాఠశాల భవనంలో విద్యార్థులతో కేటీఆర్‌ మాట్లాడారు. విద్యార్థులకు బ్యాగ్‌లు అందించారు.

కాంగ్రెస్ ఎమ్మల్యే: కాగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొనడం గమనార్హం. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగడం ఆసక్తికరంగా నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link