Maldives vs Lakshadweep: మాల్దీవులతో లక్షద్వీప్ ఒక్కటే కాదు ఈ టాప్ 5 బీచ్‌లు కూడా పోటీనే

Tue, 09 Jan 2024-6:44 pm,

త్రివేణి సంగమం ( కన్యాకుమారి)

భారతదేశపు దక్షిణాది ముఖంగా ఉన్న కన్యాకుమారిని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఇక్కడ మూడు సముద్రాలు కలుస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు హిందూ మహాసముద్రంలో సంగమించేది ఇక్కడే. సరిగ్గా మూడు సముద్రాల సంగమ స్థలమైన వివేకానంద రాక్ మెమోరియల్ అద్బుతమైన సందర్శనీయ ప్రదేశం.

మురుదేశ్వర్ బీచ్ ( కర్ణాటక)

కర్ణాటకలో సైతం అద్భుతమైన సముద్ర తీర ప్రాంత ఉంది. కర్టాటకను చెందిన కొన్ని ప్రసిద్ధి చెందిన తీర ప్రాంతాలు గోకర్ణ బీచ్, ఉడుపి బీచ్, మురుదేశ్వర్ బీచ్, చిక్ మంగళూరు బీచ్ అని చెప్పవచ్చు. 

కోవలమ్, మరారీ బీచ్ ( కేరళ)

కేరళ అంటేనే అందమైన ప్రదేశం. అద్భుతమైన తీరప్రాంతం, అందమైన బ్యాక్ వాటర్స్ కేరళ సొంతం. కేరళను భారతదేశపు సీ క్వీన్ అని కూడా పిలుస్తారు. కోవలమ్-మరారీ బీచ్ ప్రశాంతమైన వాతావరణం, అద్బుతమైన అందానికి ప్రతీక. 

హేవ్‌లాక్ ఐలాండ్ ( అండమాన్ అండ్ నికోబార్)

ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ అండమాన్ నికోబార్ దీవులు. ఈ దీవుల్లో సముద్ర తీరాలు, దట్టమైన అడవులు, కోరల్ రీవ్స్ కన్పిస్తాయి. రాధానగర్ బీచ్, హేవ్‌లాక్ ద్వీపం ప్రశాంతత మాల్దీవుల్ని వెనక్కి నెడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

అంజునా-కలంగూట్ బీచ్ (గోవా)

సూర్యుని లేలేత కిరణాల వెచ్చదనంలో స్నానం చేస్తూ ఇసుకలో దొర్లడం, సముద్రంలో సర్ఫింగ్, ముగ్దమనోహరమైన సూర్యాస్తమయం ఆస్వాదించాలంటే గోవాలోని అంజునా-కలంగూట్ బీచ్ ప్రసిద్ధి. మాల్దీవ్‌లకు పోటీ ఇచ్చే బీచ్‌లు ఇవి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link