Lakshmi Manchu Daughter Vidya Nirvana: మంచు లక్ష్మి కుమార్తె అరుదైన ఘనత
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu) కుమార్తె విద్యా నిర్వాణ(6) అరుదైన ఘనతను సాధించింది. అత్యంత పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా మంచు లక్ష్మి కూతురు నిర్వాణ ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవడం విశేషం.
Gallery: Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ
మనవరాలు విద్యా నిర్వాణ తాజాగా సాధించిన ఘనతతో టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నోబెల్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ ప్రతినిధి డాక్టర్ చోకలింగం బాలాజీ సమక్షంలో నిర్వహించిన పరీక్షలో ఆరేళ్ల చిన్నారి, తెలుగు తేజం విద్యా నిర్వాణ ఉత్తీర్ణత సాధించింది.
కూతురు విద్యా నిర్వాణ (Vidya Nirvana) సాధించిన ఘనతపై నటి మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. తల్లిగా తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు కుమార్తె సాధించిన ఘనతను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను వారి లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని నటుడు మోహన్ బాబు సూచించారు. విద్యా నిర్వాణ సాధించిన ఈ ఘనతపై మంచు వారి కుటుంబసభ్యులతో పాటు తెలుగు ప్రజలు, టాలీవుడ్ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Forbes 2020 Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ