Cholesterol Signs: చలికాలంలో కొలెస్ట్రాల్ ముప్పు, ఈ లక్షణాలుంటే జాగ్రత్త
ఇతర లక్షణాలు
ముఖంపై, కను రెప్పలపై పసుపు మచ్చలు కాయలు కన్పిస్తాయి. ఇలా కన్పించిందంటే ఇది కచ్చితంగా కొలెస్ట్రాల్ సమస్యే. చేతులు, కాళ్లపై కూడా ఇవి కన్పించవచ్చు
ఛాతీలో నొప్పి
ఛాతీలో నొప్పి అనేది గుండె వ్యాధులకు సంబంధించింది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది. హై కొలెస్ట్రాల్ కారణంగా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
చలికాలంలో సాధారణంగా శ్వాస సమస్య, అధికంగా ఉంటుంది. గట్టిగా శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఎదురౌతుంది. చెడు కొలెస్ట్రాల్ కారణంగా లంగ్స్, గుండెకు రక్త సరఫరా సరిగ్గా కాదు
అలసట
చలికాలంలో అలసట ఎక్కువగా ఉంటే అది కచ్చితంగా కొలెస్ట్రాల్ లక్షణం కావచ్చు. ధమనుల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ, ఒత్తిడి అనేవి ఆక్సిజన్ సహా పోషకాలను అందించలేవు.
కాళ్లు చేతులు చల్లబడటం
మీ కాళ్లు చేతులు చల్లబడుతుంటే ఇది కచ్చితంగా హై కొలెస్ట్రాల్ సమస్యే. ఫలితంగా రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు