Jaggery: ఖాళీ పొట్టతో ఉదయాన్నే బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..?

Thu, 22 Feb 2024-6:39 pm,

మనదేశంలో చక్కెర తర్వాత ఎక్కువ మంది బెల్లను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా శుభకార్యాలలో బెల్లం వినియోగించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం బెల్లం, నువ్వుల పొడితో తయారు చేసిన లడ్డులను తినాలంటారు..  

ఉదయాన్నే బెల్లం తింటే శరీరంలోని ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. జీర్ణ వ్యవస్థలో ఏదైన ఇబ్బందులుంటే వెంటనే తొలగిపోతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు, మినరల్స్ లు బెల్లం తో మనకు అందుతాయి. ఇమ్యునిటీ మెరుగుపరుస్తుంది.

మనకు ఎప్పుడైన సత్తువ లేనప్పుడు , కళ్లు తిరిగినట్లు అన్పిస్తే.. బెల్లం ముక్క ఒకటి నోట్లో వేసుకుంటే వెంటనే యాక్టివ్ గా అయిపోతాం. బరువు పెరగకుండా కూడా ఇది చూస్తుంది. చక్కెర కన్నా కూడా బెల్లం టీ తాగడం మంచిదని నిపుణులు చెబుతారు..

కడుపులో వికారం,వాంతులు వచ్చిన లేదా మోషన్స్ అయిన కూడా బెల్లం తింటే వెంటనే ఉపశమనంగా ఉంటుది. బెల్లంను ఏ కాలంలో నైన తినోచ్చు. గొంతు సమస్యలను కూడా దూరం చేస్తుంది. 

కొందరికి ఎముకల వదులుగా నొప్పులుగా ఉంటాయి. ఇలాంటి  వారు ప్రతిరోజు బెల్లం తింటే ఎంతో ప్రయోగజన కరంగా ఉంటుంది. మహిళలు బెల్లం రెగ్యులర్ గా తింటే పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఉండదు.

కొందరిలో బీపీ అధికంగా ఉంటుంది. తరచుగా శరీంలో ఉష్ణోగ్రతలు అబ్ నార్మల్ గా అవుతుంటాయి. ఇలాంటి వారికి కూడా ఇది పనిచేస్తుంది. వయసుకన్న ముందే కొందరికి ముఖంపై ముడతలు, తెల్ల వెంట్రులకు వస్తాయి. బెల్లం తింటే వీటికి చెక్ పెట్టేయోచ్చు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link