Betel Leaves: పరగడుపున తమలపాకులు తింటే కలిగే ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా..?
తమలపాకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో పుష్కలమైన విటమన్ లు ఉన్నాయి. కెరోటిన్ , కాల్షియం లు కూడా అధికమోతాదులో ఉంటాయి. దీంతో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
తమల పాకులు తినడం వల్ల అజీర్తి సమస్య ఉండదు. నోటి నుంచి దుర్వాసన కూడా రాదు. అనవసర కొవ్వును తగ్గించడంలో ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. అందుకు దీన్ని తినాలంటారు.
రక్తపోటు సమస్యలున్న వారికి బాగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యలున్న మహిళలకు ఇది నొప్పి నివారించేలా చేస్తుంది. నోటిలో పుండ్లు ఏర్పడకుండా చూస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.
కొందరికి శరీరంలో అధికమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి వారు ప్రతిరోజు తమలపాకును క్రమం తప్పకుండా తింటే పుష్కలమైన ఆరోగ్య లాభాలు కల్గుతాయి. శరీరం నుంచి మలినాలను చెమట రూపంలో పోయేలా చేస్తుంది..
దగ్గు, దమ్ము వంటివి దూరమైపోతాయి. గొంతులు గర గర ఉన్న వారు ప్రతిరోజు తమలపాకులను తింటే మంచి ఔషధంగా పనిచేస్తుంది. తమలపాకును మెత్తగా చేసి గాయం ఉన్న చోట పెడితే , గాయం కూడా మానిపోతుంది. కొందరు చెవిలో దీని రసం ను కూడా వేస్తుంటారు.
తమలపాకులు గ్రహాదోషాలు పారద్రోలడంలో ఉపయోగపడతాయి. మంగళవారం, ఆంజనేయుడికి ఎక్కువ మంది భక్తులు తమలపాకులతో పూజలు చేస్తుంటారు. ఇలా చేస్తే నవగ్రహాదోషాలు తగ్గిపోతాయని చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)