Sunflower Seeds Benefits: పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..!
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ గింజలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.
పొద్దుతిరుగుడు విత్తనాల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి రక్తనాళాలకు మేలు చేస్తాయి. ఇది హైబీపీని కూడా కంట్రోల్ చేస్తుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల మహిళలు రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. ఇందులో ఉండే లిగ్నన్ అనే పానీఫెనాల్ బాడీలో యాంటీయాక్సిడెంట్ గా పనిచేస్తుంది.
మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా ఉండాలన్నా పొద్దుతిరుగుడు విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో ఎక్కువగా కాల్షియం మరియు జింక్ వంటి పోషకాలు ఉంటాయి.
పొద్దుతిరుగుడు సీడ్స్ లో ఐరన్, జింక్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను ధృడ పరచడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి.