AP Liquor shops Closed: ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు లిక్కర్ షాపులు క్లోజ్..
AP Liquor shops Closed: ఏపీలో ఎన్నికల కోలాహలం మళ్లీ మొదలైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నెల 5న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ 48 గంటల పాటలు మద్యం షాపులను బంద్ చేయాలని హూకుం జారీ చేసింది.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ నిబంధన అమల్లోకి రానుంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 5వ తేది 4 గంటల వరకు మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలో ఉన్న మద్యం షాపులను ఎన్నికలు జరిగేవరకు 48 గంటల పాటు బంద్ చేయాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్వర్వులు జారీ చేసారు.
ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి షాపులు తెరిస్తే..వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించడంతో పాటు వారి మద్యం లైసెన్స్ ను క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఎవరు అక్రమంగా మద్యం అమ్మకాలు చేసినా తీవ్ర చర్యలు ఉంటాయన్నారు.
డిసెంబర్ 5న జరిగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషనర్ తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ జరిగే కేంద్రాల్లో డబ్బు పంపణి జరగకుండా పోలీసులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మొత్తంగా ఐదు జిల్లాల పరిధిలో 16,737 మంది ఓటర్లు ఈ ఎన్నికల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘం పోలింగ్ కోసం 116 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
డిసెంబర్ 5న గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ నిర్వహించనున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీకి తరలించనున్నారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ పేపర్స్ డబ్బాలను పెట్టనున్నారు.
ఇప్పటికే పోలింగ్ జరిగే కేంద్రాలపై కలెక్టరేట్ లో పీవోలు, ఓపీవోలు పీవోలు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ సెక్షన్ ఆఫీసర్స్ కు పోలింగ్ పై అవగాహన కల్పించారు. మొత్తంగా ఎలక్షన్స్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అనుసరించే విధి విధాలపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలింగ్ జరిగే రోజు విధుల్లో ఉన్న వారందరు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.