Lower Interest Rates On Home Loans: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. అతి తక్కువ వడ్డీకే రుణాలు
డబ్బులు ఉన్న వారికి కూడా అవసరం పడే బ్యాంకింగ్ సేవలు లోన్స్. అది హోమ్ లోన్ లేక పర్సనల్, వెహికల్ లోన్ ఇతరత్రా ఏదైనా రకం కావొచ్చు. అయితే మీరు లోన్ తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారా.. మీకు సొంతింతి కలను సాకారం చేసుకోవాలని ఉందా.. అయితే మీకు ఇది కచ్చితంగా గుడ్ న్యూస్. హోమ్ లోన్స్‌పై తాజాగా వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఓ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి వరంలా కనిపిస్తుంది.
కొన్ని సందర్భాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తుంటాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ యూకో బ్యాంక్ ఖాతాదారులకు తీపి కబురు చెప్పింది. ఇంటి కోసం తీసుకునే లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది.
హోమ్ లోన్స్ (Home Loans)పై 0.25శాతం మేర వడ్డీని తగ్గిస్తూ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవల ఈ నిర్ణయం అమలులోకి రాగా, ప్రస్తుతం యూకో బ్యాంక్ నుంచి హోమ్ లోన్స్ తీసుకునేందుకు భారీగా డిమాండ్ పెరిగింది.
ఇటీవల తగ్గించిన వడ్డీ రేట్లు నవంబర్ 18 నుంచే అమలులోకి వచ్చాయి. తద్వారా యూకో బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు ఇప్పుడు 6.9 శాతం నుంచే ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు పోటీగా తీసుకున్న నిర్ణయమని చెప్పవచ్చు.
Also Read : Best Unlimited Prepaid Plans Under Rs 500: బెస్ట్ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్.. వివరాలు ఇవే
అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ తమ కస్టమర్లకు ఇంటి రుణాలను 6.9శాతం వడ్డీకే అందిస్తుందని తెలిసిందే. యూకో బ్యాంక్ 0.25శాతం వడ్డీ రేటు తగ్గించడంతో SBIతో సమానంగా హోమ్ లోన్ అందిస్తున్న బ్యాంక్‌గా అవతరించింది. హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ విషయంలో కాస్త తారతమ్యం ఉందని కస్టమర్లు గమనించాలి.
Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే..