Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Fri, 08 Jan 2021-4:34 pm,

వ్యక్తిగత రుణం(Personal Loan) సులువుగా దొరుకుతుంది. డబ్బు అత్యవసరంగా కావాలనుకునేవారు పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేకుండా రుణాన్ని పొందచ్చు. ఏదేమైనా, బంగారు రుణం(Gold Loan), హోమ్ లోన్లతో పోల్చితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ముందుగా ఏ బ్యాంకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుందో తెలుసుకోవడం మంచిది.

Also Read: Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్క్.. 10 ఆసక్తికర విషయాలు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీసం 8.9 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. అయితే ఓవరాల్‌గా చూస్తే 8.9 శాతం నుంచి 12శాతం మధ్యలో వడ్డీ రేటు వసూలు చేస్తుంది. అయితే తీసుకునే నగదు రుణం, చెల్లించే గడువు మీద వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనీసం 8.95 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. అయితే ఓవరాల్‌గా చూస్తే 8.95 శాతం నుంచి 11.80 శాతం మధ్యలో వడ్డీ రేటు వసూలు చేస్తుంది. అయితే తీసుకునే నగదు రుణం, చెల్లించే గడువు మీద వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

కనీసం 9.60 శాతం వడ్డీ రేటుతో SBI వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. అయితే ఓవరాల్‌గా చూస్తే 9.6 శాతం నుంచి 13.85 శాతం మధ్యలో వడ్డీ రేటు వసూలు చేస్తుంది. అయితే తీసుకునే నగదు రుణం, చెల్లించే గడువు మీద వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) కనీసం 10.10 శాతం వడ్డీ నుంచి గరిష్టంగా 15.45 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. అయితే తీసుకునే నగదు రుణం, చెల్లించే గడువు మీద వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంకు కనీసం 10.75 శాతం నుంచి గరిష్టంగా 21.30 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. అయితే తీసుకునే నగదు రుణం, చెల్లించే గడువు మీద వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link