LPG cylinders prices to change weekly: LPG cylinders ధరలు ఇక వారానికి ఓసారి మార్పు ?

Wed, 23 Dec 2020-9:43 pm,

ప్రస్తుత విధానంలో నెల రోజులకు ఒకసారి ఎల్పీజీ ధరలు మార్చడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన సందర్భాల్లో తాము నెల మొత్తం న‌ష్ట‌పోతున్నాం అని ఆయిల్ కంపెనీలు వాపోతున్నాయి.

ఇదిలావుంటే, ఇప్ప‌టికే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సైతం ప్రతీరోజు సవరిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ప్రతీ 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు సవరించేవాళ్లు. అయితే, అలా చేయడం వల్ల ధరలు పెరిగినప్పుడు తాము మిగతా రోజులపాటు నష్టపోతున్నాం అనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయిల్ కంపెనీలు ఏ రోజుకు ఆ రోజు ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఆయిల్ కంపెనీలు ( Oil companies ) తీసుకున్న ఈ నిర్ణయం కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కలిగే నష్టం నుంచి బయపడగలిగామని భావిస్తున్న ఆయిల్ కంపెనీలు తాజాగా అదే పద్ధతిని ఎల్పీజీ సిలిండర్ల ధరల మార్పు విషయంలోనూ వర్తింపజేయాలని చూస్తున్నాయి.

ఇంకా చెప్పాలంటే ఇప్ప‌టికే ఆయిల్ కంపెనీలు ఒక రకంగా ఈ పద్దతిని అనధికారికంగా ప్రారంభించేశాయి. డిసెంబ‌ర్‌ ఒక్క నెలలోనే ఎల్పీజీ సిలిండర్ల ధరలు ( LPG cylinders prices ) రెండుసార్లు పెర‌గ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం. 

రాయితీపై లభించే ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర డిసెంబ‌ర్ 2న రూ.50 మేర పెర‌గ‌గా.. డిసెంబ‌ర్ 15న మ‌రోసారి అంతే మొత్తంలో ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

డిసెంబర్ నెలలో 2 వారాల వ్యవధిలోనే రెండుసార్లు ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు.. వచ్చే ఏడాదిలో వారానికి ఒకసారి ధరలు సవరించే అవకాశం ఉంది. ( Image credits : PTI )

అయితే, ఆయిల్ కంపెనీలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం కూడా తమ సబ్సీడీలో ( LPG cylinders Subsidy ) మార్పుచేర్పులు చేస్తుందా అనేదే ప్రస్తుతానికి చర్చనియాంశంగా మారింది. ( Image credits : PTI )

Also read : PM KISAN scheme: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి డబ్బులు ఎప్పుడు పడతాయి ?

Also read : Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ తెలుసా ?

Also read : 7th Pay Commission: గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు

Also read : SBI alert: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link