LPG Tatkal Seva: బుకింగ్ చేసిన అరగంటకే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ
LPG Tatkal Seva: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అనగానే సామాన్యుడికి మొదటగా గుర్తుకొచ్చేది దాని ధర. లేకపోతే దానిపై ఏమైనా సబ్సిడీ అందించారా, లేక ధరలు పెరిగాయా అని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త సేవల్ని LPG వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.
ఎల్‌పీజీ వినియోగదారులు బుక్ చేసుకున్న అరగంటలోనే వారికి సిలిండర్ డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ మేరకు తత్కాల్ సేవల్ని(LPG Tatkal Seva) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!
ఇందుకోసం ముందుగా ప్రతి రాష్ట్రంలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓ జిల్లానుగానీ, లేక ఓ నగరాన్ని ఎంచుకుని వారికి తత్కాలు సేవల్ని అందించనున్నారు. దీని ద్వారా LPG సిలిండర్ బుక్ చేసుకున్న అరగంట నుంచి 45 నిమిషాల్లోనే వినియోగదారులకు సిలిండర్ డెలివరీ కానుంది.
సులభతర జీవనాన్ని మెరుగు పరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.
Also Read: LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే
ఐఓసీ ఇండేన్(Indane) ద్వారా ఎల్‌పీజీ తత్కాల్ సేవల్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. భారత్‌లో ప్రస్తుతానికి దాదాపుగా 14 కోట్ల మంది ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ఫిబ్రవరి 1 లోగా ఎల్‌పీజీ తత్కాల్ సేవలు(LPG Tatkal Seva) వంటగ్యాస్ సేవలు ప్రారంభనుంది.