Madras High Court: హగ్‌లు ఇచ్చుకొవడం, ముద్దులు పెట్టుకోవడం నేరంకాదు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..
సాధారణంగా చాలా మంది యువత ఇటీవల కాలంలో స్కూల్ డేస్ లోనే లవ్ ఎఫైర్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు.. కాలేజీ రోజుల్లో ప్రేమ, డేటింగ్ లు ఉండేవి. కానీ ఇప్పుడైతే స్కూల్ డేస్ లోనే లవర్ లను మెంటెన్ చేస్తున్నారు.
అబ్బాయిలకు అమ్మాయిులు కూడా ఏమాత్రం తగ్గేదేలా అన్న విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఇద్దరు, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లను మెంటైన్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ లను మెంటైన్ చేయడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొంత మంది యువత చదువుకునే రోజుల్లోనే అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా.. లవర్స్ లతో పనికానిచ్చేస్తున్నారు. కొందరైతే.. తమ అవసరాల కోసం ఎదుటి వాళ్ల బలహీనతల్ని వాడుకుంటున్నారు. తమ కోరిక తెరిస్తే.. వాళ్లకు కావాల్సింది చేసి పెడతామంటూ వేధిస్తున్నారు.
కొందరు ఎదుటివాళ్లకు మాయమాటల చెప్పి, మంచిగా ఉన్నట్లు నటించి,అసలు రంగు చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో. 2022 నవంబర్‌లో ఒక రోజు ఇద్దరు లవర్స్.. రాత్రి తాము ఇద్దరం కలుసుకున్నారు. అప్పుడు అతగాడు.. ఆమెను చూసి టెమ్ట్ అయి ముద్దులు పెట్టి , గాఢంగా కౌగిలించుకున్నాడంట.
దీంతో ఆమె.. రెచ్చిపోయి చిందులు వేస్తు వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు అప్పటి నుంచి అనేక కోర్టులలో నడుస్తొంది. తాజాగా ఈ కేసు హైకొర్టుకు చేరింది. దీనిపై హైకొర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. యువత ప్రేమలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టుకొవడం, హగ్ లు చేసుకొవడం కామన్.. అంటూ వ్యాఖ్యలు చేసింది.
అంతే కాకుండా.. కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్.. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) కింద వీటిని నేరాలుగా పరిగణించడం కుదరదని కూడా తీర్పును వెల్లడించింది. దీంతో యువకుడికి బిగ్ రిలీఫ్ దొరకగా.. కొందరు మాత్రం మద్రాస్ హైకొర్టు తీర్పుతో తమ జుట్లను పీక్కుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం వార్తలలో నిలిచింది.