Mahatma Gandhi Jayanti 2021: మహాత్మా గాంధీ 152వ జయంతి, మోదీ, సోనియా ప్రముఖుల నివాళి
మహాత్మాగాంధీ 152వ జయంతి నేడు. దేశం మొత్తం జాతిపితకు నివాళులర్పిస్తున్నారు. భారతదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహాత్మునికి నివాళి అర్పించారు.
దేశం మొత్తం జాతిపిత మహాత్మా గాంధీకు నివాళి అర్పిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, అహింసావాదిగా దేశాన్ని ప్రభావితం చేసిన మహనీయునికి దేశంలోని ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతిపిత గాంధీకు నివాళి అర్పించారు.
మహాత్ముడి 152వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకు నివాళులర్పించారు. చిత్రపటానికి పూలమాలలేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ జీవితం, ఆయన ఆదర్శాలు దేశంలోని ప్రతి తరాన్ని కర్తవ్యపధంలో కీసుకెళ్తాయని మోదీ ట్వీట్ చేశారు.