Makara Jyothi 2024: శబరిమల అయ్యప్ప `మకర జ్యోతి` దర్శనం..మీరు దర్శించుకోండి ఇలా..
ఈ సంవత్సరం శబరిమల కొండపై సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఈ సమయంలో భక్తులంతా అయ్యప్ప నామస్మరణతో మకర జ్యోతిని దర్శించుకున్నారు.
ప్రతి సంవత్సరం శబరిమల మకర జ్యోతి సంక్రాంతి రోజున దర్శనమిస్తుంది. కాబట్టి దీనిని భక్తులు శబరిమల మకరవిళ్ళక్కు లేదా మకర జ్యోతిగా పిలుస్తారు. ఏడాది మకర సంక్రాంతి రోజు ఈ జ్యోతి దర్శనం కోసం లక్షలాదిమంది శబరిమల కొండపైకి తరలివస్తారు.
ప్రతి సంవత్సరం మకర జ్యోతి ఘట్టం రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 15 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం ఇచ్చింది.
ప్రతి సంవత్సరం శబరిమల ఆలయ బోర్డు ప్రతి సంవత్సరం ఈ మకర జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది ఈ మకర జ్యోతి దర్శనం కేవలం మూడుసార్లు మాత్రమే దర్శనమిస్తుంది. ఇదే సమయంలో మాత్రమే మకర జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి లోటు రాకుండా, ఇబ్బందులు తలెత్తకుండా శబరిమల ఆలయ బోర్డు వివిధ ప్రాంతాల్లో 4000 మంది పోలీసులతో బందోబస్తున ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని కొండ ప్రాంతాల్లో భక్తుల కోసం త్రాగునీరును, వైద్య సదుపాయాలను కూడా అందిస్తోంది.
మకర జ్యోతిని దర్శించుకోవడం చాలా అదృష్టం. ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం వల్ల అదృష్టం తో పాటు మంచి ఆరోగ్యం సమాజంలో శ్రేయస్సు లభిస్తుందని అయ్యప్ప భక్తుల నమ్మకం. అంతేకాకుండా జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయట.