Pomegranate Peels Tea: రోజూ దానిమ్మ తొక్కల టీ తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా
చర్మ సంరక్షణ
దానిమ్మ తొక్కల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అథికంగా ఉంటాయి. పింపుల్స్, ర్యాషెస్ తగ్గించడంలో దోహదపడుతుంది. చర్మాన్ని డీటాక్స్ చేయవచ్చు.
కేన్సర్ నుంచి రక్షణ
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం దానిమ్మ తొక్కల టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల బ్రెస్ట్ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, ప్రేవుల కేన్సర్ వంటి వాటి నుంచి రక్షించవచ్చు.
కొలెస్ట్రాల్ తగ్గించడం
దానిమ్మ తొక్కల టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ తగ్గించవచ్చు. అంతేకాకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెంచవచ్చు.
చలి జలుబు జగ్గు నుంచి రక్షణ
దానిమ్మ తొక్కలతో టీ చేసుకుని తాగితే దగ్గు, గొంతులో గరగర వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కఫం సమస్య దూరమౌతుంది. దానిమ్మ తొక్కలతో టీ తాగితే గొంతులో స్వెల్లింగ్, నొప్పి వంటి సమస్యలు దూరమౌతాయి.
దానిమ్మ తొక్కలతో టీ ఎలా చేయాలి
10 గ్రాముల దానిమ్మ తొక్కల్ని ఓ కప్పు నీటిలో ఉడకబెట్టాలి. 5 నిమిషాలు తరువాత స్టవ్ ఆర్పేయాలి. ఈ టీని రోజుకు 2-3 సార్లు తాగితే మంచిది
బ్లడ్ షుగర్ కంట్రోల్
దానిమ్మ తొక్కల టీ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్, గుండె వ్యాధుల ముప్పు తగ్గించవచ్చు. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అద్భుతంగా తగ్గించవచ్చు.