Malavika Mohanan: పొట్టిడ్రెస్ లో ప్రభాస్ భామ మాళవిక మోహన్ హల్ చల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Wed, 02 Oct 2024-3:51 pm,

మాళవిక కెరీర్ మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ తనయగా  ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది.

మాస్టర్ మూవీతో బ్రేక్.. ఇక విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో హీరోయిన్ గా ఈమె పేరు మారుమోగిపోయింది.  

 

ఫస్ట్ మూవీ.. 2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' చిత్రంతో మాళవిక మోహనన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

శాండిల్ వుడ్.. ‘పట్టామ్ పోలే’ తర్వాత ‘నిర్ణాయకం’ చిత్రంలో తన నటనతో అట్రాక్ట్ చేసింది.అటు శాండివుడ్‌లో సైతం తన లక్ ను పరీక్షించుకుంది. మొత్తంగా సౌత్ లో అన్ని మెయిన్ ఇండస్ట్రీస్ యాక్ట్ చేసి మెప్పించింది.

 

బాలీవుడ్.. హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా ‘యుద్రా’ మూవీతో పలకరించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

పేట మూవీతో బ్రేక్.. మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో మంచి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది.

తంగలాన్..

రీసెంట్ గా ‘తంగలాన్’ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షలను మెప్పించింది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో మాళవిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

ది రాజా సాబ్.. మొత్తంగా దేశంలోని మెయిన్ సినీ ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన మాళవిక మోహనన్.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

మాళవిక కెరీర్.. ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతోనైనా కథానాయికగా మాళవిక మోహనన్ కెరీర్ పరుగులు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రం లతర్వాత మాళవికకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link