Malavika Mohanan: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న మలయాళీ అందం మాళవిక మోహనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన నటన కంటే తన అందాల ప్రదర్శనతో ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
మాళవిక మోహనన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.
త్వరలో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాపై మాళవిక ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది.
2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీ మాళవిక మోహనన్ ఫస్ట్ మూవీ. ఆ తర్వాత నిర్ణయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేలో పడింది.
హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
సినీ ఇండస్ట్రీలో మలయాళీ భామలకు ఉన్న క్రేజ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన హీరోయిన్స్ చాలా మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన వాళ్లే. ఈ కోవలో సౌత్ సినీ ఇండస్ట్రీలో మాళవిక మోహనన్ ‘ది రాజా సాబ్’తో సత్తా చూపెడుతుందా లేదా అనేది చూడాలి.