Malavya Raja Yoga Effect: మాలవ్య రాజయోగం పవర్‌ఫుల్ ఎఫెక్ట్.. ఈ రాశిల వారికి అడుగేసిన ప్రతిచోట డబ్బే..

Fri, 20 Dec 2024-6:56 am,

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని ప్రేమ, ఆనందం, ధనం, సంతోషానికి సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి వ్యక్తిగత జీవితాల్లో ఈ నాలుగింటికి సంబంధించిన మార్పులు వస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు..   

శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే ఇదే సమయంలో శని గ్రహ కదలికలు కూడా జరుగుతాయి.. దీనివల్ల ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం కూడా ఏర్పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల ఈ క్రిందిరాశుల వారికి చాలా కలిసి వస్తుంది.

ముఖ్యంగా ఈ శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడడం వల్ల కర్కాటక రాశి వారు ఎన్నడూ ఊహించని శుభవార్త వింటారు. అలాగే వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి.. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రత్యేకమైన హోదా కూడా లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది.

కర్కాటక రాశి వారికి కొంత భార్యకు సంబంధించిన ఆస్తి కూడా లభించే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దాంపత్య జీవితంలో ఎన్నడూ పొందలేని ఆనందాన్ని కూడా సొంతం చేసుకుంటారు. ఇక వీరికి ఈ సమయంలో ఆధ్యాత్మికత పై ఆసక్తి పెరగడంతో తీర్థయాత్రలకు కూడా వెళ్తారు..

అలాగే వృషభ రాశి వారికి ఈ ప్రత్యేకమైన యోగం ఎఫెక్ట్‌తో అదనపు బాధ్యతలు పెరిగి.. ఊహించని ఆదాయ మార్గాలు కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది.. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఇప్పుడు అధిక డబ్బుతో తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు వీరు కొత్త ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు.   

వృషభ రాశి వారు ఈ సమయంలో వ్యాపారాలపరంగా అద్భుతమైన నాలెడ్జ్ ని సొంతం చేసుకుంటారు. దీంతోపాటు వీరికి ఈ సమయంలో కొత్త ఆస్తులు కూడా లభించే ఛాన్స్ ఉంది.. ఇక కుటుంబాలపరంగా వీరికి డోకా ఉండదు. తల్లిదండ్రుల సపోర్టు లభించి ఎప్పుడు పొందలేని సంతోషాన్ని కూడా పొందుతారు.  

ధనస్సు రాశి వారికి కూడా ఉద్యోగాలపరంగా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.. వీరికి కొత్త ఆస్తులు లభించడమే కాకుండా పొదుపు చేసిన డబ్బు కూడా ఈ సమయంలో భారీ మొత్తంలో తిరిగి వస్తుంది. అలాగే గతంలో సంతోషం కంటే ఈ సమయంలో విపరీతంగా   సంతోషం, ఉత్సాహం పెరిగే ఛాన్స్ ఉంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link