Malvi Malhotra: అచ్చం సమంతలా ఫోజులిస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్ర.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
మాల్వీ మల్హోత్ర.. తెలుగులో రాజ్ తరుణ్ తో చేసిన ‘తిరగబడరా సామి’మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాలో మాల్వీ బాలయ్య ఫ్యాన్ పాత్రలో ఊర మాస్ గా మెప్పించింది.
అయితే.. రాజ్ తరుణ్ ఇష్యూతో ‘తిరగబడరాస్వామి’ మూవీకి పెద్దగా కలిసొస్తుందని అనుకున్నారు. కానీ ప్రేక్షకులు వీళ్ల కన్నా తెలివైనవాళ్లు కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తిప్పి కొట్టారు.
ఈ సినిమా విడుదల కాకముందు ఒక్కసారిగా రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూతో మాల్వీత ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తాజాగా ఈమె విడుదల చేసిన ఫోటోలు అచ్చం సమంతను పోలి ఉన్నట్టు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.
మాల్వీ మల్హోత్రతో రాజ్ తరుణ్ డేటింగ్ చేస్తున్నాడు కాబట్టి .. తనను పట్టించుకోకుండా మోసం చేసాడని అందుకు కారణం ఈమెనే అనే ఆరోపణలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది లావణ్య.
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మాల్వీ మల్హోత్ర హిందీలో తెరకెక్కిన టీవీ సీరియల్ ‘ఉడాన్’ సీరియల్ తో 2017లో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 2018లో ‘హోటల్ మిలన్’ మూవీతో హిందీ తెరకు పరిచయం అయింది.
ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్, ఓటీటీ వేదికగా ‘జొరావర్ ది జాక్వెలిన్’ అనే ఓటీటీ మూవీలో నటించింది. 2023లో ‘అభ్యుదయం’ అనే మలయాళ మూవీలో నటించింది.
ఇటు తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామి’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదల కాకముందే రాజ్ తరుణ్ తో డేటింగ్ చేస్తోందన్న కారణంగా వార్తల్లో నిలిచింది. విడుదల తర్వాత మాల్వీకి పెద్దగా ఒరిగిందేమి లేదు.
అంతేకాదు మాల్వీ వాళ్ల ఫ్యామిలీకి హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అలా అక్కడ అధికారంలో ఉన్న పార్టీ వాళ్లతో తనను బెదిరించినట్టు లావణ్య పేర్కొంది. ఈమె సినిమాల్లో నటిస్తూనే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది.
మొత్తంగా తెలుగులో నటించిన తొలి సినిమా విడుదల కాకముందే..వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తీరా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టకపోవడంతో మాల్వీకి నిరాశే ఎదురైందని చెప్పాలి.