Malvika Sharma: అందాల విందుల హద్దులో చెరిపేసిన మాళవిక శర్మ.. రవితేజ భామ గ్లామర్ కుర్రాళ్లు గిల గిల..

Fri, 12 Jul 2024-7:55 am,

మాళవిక శర్మ మహారాష్ట్రకు చెందిన ఈమె రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో హీరోయిన్‌గా సరైన బ్రేక్ రాలేదు. మాస్ మహారాజ్ తో నటంచిన ‘నేల టిక్కెట్టు’ మూవీలో బాక్సాఫీస్ దగ్గ డిజాస్టార్ అయినా.. ఇందులో మాళవిక గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

మాళవిక శర్మ విషయానికొస్తే.. హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే న్యాయవాద వృత్తిని కొనసాగిస్తోంది. తెలుగులో నేల టిక్కెట్టు తర్వాత రామ్ పోతినేని సరసన 'రెడ్' మూవీలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.

అటు తెలుగుతో పాటు తమిళంలో 'కాఫీ విత్ కాతల్' మూవీతో పలకరించింది. ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా'లో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

మాళవిక నటి కాకముందు మోడల్‌గా పలు ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరించింది. 2017లో హిమాలయా, డెటాల్‌, మలబార్ వంటి కొన్ని టీవీ యాడ్స్ లో కనిపించింది.

మాళవిక పర్సనల్ విషయాలకు వస్తే.. నటి, మోడల్ మాత్రమే కాదు ఆమె ఓ లాయర్ కూడా. మాళవిక తన కాలేజీ రోజుల్లో మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.

మాళవిక శర్మ.. 1999 జనవరి 26న ముంబైలో జన్మించింది. ఈమె కుటుంబం ఉత్తరాదికి చెందినవారు. చదువు కొనసాగిస్తూనే హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి.. అటు న్యాయవాద వృత్తిలో కొనసాగిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link