Malvika Sharma: బ్లాక్ డ్రెస్‌లో మాళవిక శర్మ పరువాల విందు.. ఇది నెక్ట్స్ లెవల్ బాసూ..

Wed, 01 May 2024-9:33 am,

మాళవిక శర్మ తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఇప్పటికీ హీరోయిన్‌గా సరైన బ్రేక్ రాలేదు. నేల టిక్కెట్టు మూవీలో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయకపోయినా.. ఇందులో మాళవిక గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

మాళవిక శర్మ విషయానికొస్తే.. హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే న్యాయవాద వృత్తిని కొనసాగిస్తోంది. తెలుగులో నేల టిక్కెట్టు తర్వాత రామ్ పోతినేని సరసన 'రెడ్' మూవీలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.

మాళవిక శర్మ.. అటు తెలుగుతో పాటు తమిళంలో 'కాఫీ విత్ కాతల్' మూవీతో పలకరించింది. ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా'లో యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

మాళవిక శర్మ.. 1999 జనవరి 26న ముంబైలో జన్మించింది. ఈమె కుటుంబం ఉత్తరాదికి చెందినవారు. చదువు కొనసాగిస్తూనే హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి.. అటు న్యాయవాద వృత్తిలో కొనసాగిస్తోంది.

మాళవిక పర్సనల్ విషయాలకు వస్తే.. నటి, మోడల్ మాత్రమే కాదు ఆమె ఓ లాయర్ కూడా. మాళవిక తన కాలేజీ రోజుల్లో మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. అందులో భాగంగా ఆమె 2017లో హిమాలయా, డెట్టాల్, మలబార్ వంటి కొన్ని టీవీ ప్రకటనలలో కూడా కనిపించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link