Photos: కేసీఆర్, కేటీఆర్ కి క్లోజ్ అంటూ ప్రజలను మోసం చేసిన యువకుడు
తన వాట్సాప్ స్టేటస్ తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ లో సీఎం కేసీఆర్ తో దిగిన ఫోటోలను షేర్ చేసేవాడు.
మంత్రి కేటీఆర్ కు కూడా పలు సందర్భాల్లో కలిసిన ఫోటోలను చూపించి జనాలకు బురటీ కొట్టించే వాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో నకిలీ లెటర్ ప్యాడ్స్ క్రియేట్ చేసినట్టు చింటూను అదుపులో తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
అక్కడితో ఆగకుండా Telangana State All India Anti- Corruption Commission చైర్మన్ అని, టీఆర్ ఎస్ పార్టీకి కరీంనగర్ యువజన కార్యదర్శి గా నకిలీ పత్రాలు క్రియేట్ చేశాడు.
తరచూ కీలక నేతలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసేవాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన చింటూ అనే యువకుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్త.
ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలు చూసుకునే బాధ్యత తనకు అప్పగించినట్టుగా నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడని సమాచారం.
మంత్రి కేటీఆర్ తనకు చాలా క్లోజ్ అని చెప్పి అమాయకులను మోసం చేసేవాడు చింటు