Manchu Family: మంచు ఫ్యామిలీ మంట.. ఎవరు ఈ వినయ్ మహేశ్వరి..!
Manchu Family - Vinay Maheshwari:తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఇపుడు రాజకీయాల కంటే.. మంచు ఫ్యామిలీ గొడవే పెద్ద హైలెట్ గా నిలుస్తుంది. బిగ్ బాస్ కు మించిన ట్విస్టులు, టాస్క్ లతో సంచలనమే రేపుతుంది. ఇక ఈ మంచు ఫ్యామిలీ రచ్చలో ఇపుడు వినయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ వినయ్ అని చెబుతున్న వినయ్ మహేశ్వరి ఎవరనే విషయానికొస్తే..
ఆయన మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా.. ట్రస్టీ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు వినయ్ మహేశ్వరి. ఈయన 2019 నుండి 2022 వరకు సాక్షి మీడియా సంస్థల CEO గా పనిచేసారట.
ఆ తర్వాత ఇండియా టీవీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ సీఈవోగా పనిచేసారు. ప్రెజెంట్ మోహన్ బాబుకు చెందిన మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు మంచు విష్ణుకు చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మేనేజింగ్ పార్టనర్ గా ఉన్నారు.
అంతేకాదు Sucstrat Consulting Private Limited కి మేనేజింగ్ డైరెక్టర్ గా CEO గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వినయ్ మహేశ్వరి. ఈయన నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే మోహన్ బాబు యూనివర్సిటీలో ఉంటారు. మిగిలిన టైమ్ మొత్తం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్ లో ఉంటారని ఆయన సన్నిహితులు సమాచారం.
కొన్ని రోజులు క్రితం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరిగిన ఫీజుల అక్రమాలపై జరిగిన అవకతవకలపై కలవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులని కలవడానికి ఇతను నిరాకరించిన సంగతి తెలిసిందే కదా.