Margasira Purnima 2024: మార్గశిర పౌర్ణమి ఎంత పవర్ ఫుల్.. ఈ పరిహారాలు చేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. డోంట్ మిస్..
మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కొన్ని నివారణలు చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిరకాల కోరికలు కోరుకునేవారు ఈ పౌర్ణమి రోజున తప్పకుండా భక్తిశ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నియమాలు కూడా పాటించాలి ఉంటుంది.
మార్గశిర మాసంలోని పౌర్ణమి ఈ సంవత్సరం డిసెంబర్ నెల 14వ తేదీన వచ్చింది. ఈ పౌర్ణమికి సంబంధించిన తిథి 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పౌర్ణమి జరుపుకోవాలనుకునేవారు 15వ తేదీన జరుపుకోవడం చాలా శుభప్రదం.
మార్గశిర పౌర్ణమి రోజున నది స్నానం చేసి బ్రహ్మ ముహూర్తాన దానం చేయడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయట. ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కాబట్టి ఈరోజు తప్పకుండా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
మార్గశిర మాసంలోని బ్రహ్మ ముహూర్తంలో తులసి మొక్కను పూజించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. తులసి మొక్కను పూజించే క్రమంలో మొక్కకు ఎరుపు రంగుతో కూడిన కాటన్ గుడ్డను కట్టి తప్పకుండా నెయ్యితో దీపం వెలిగించాల్సి ఉంటుంది. అలాగే పాలతో చేసిన నైవేద్యాన్ని కూడా సమర్పించడం చాలా శుభప్రద అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మార్గశిర పౌర్ణమి రోజున చాలామంది సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకుంటారు. ఈ వ్రతంలో భాగంగా ఓం నమో సత్యనారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందట. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి అని పురాణాల్లో పేర్కొన్నారు.
ముఖ్యంగా మార్గశిర పౌర్ణమి రోజున చాలామంది శ్రీమహావిష్ణువుని కూడా పూజిస్తూ ఉంటారు. అయితే ఈరోజు శ్రీమహావిష్ణువు విగ్రహానికి పాల, గంగాభిషేకాలు చేయడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందట. అంతేకాకుండా ఆరోగ్యవంతంగా తయారవుతారట.