Niharika: చైతన్య కోసం మెగా హీరోలను పక్కనపెట్టిన నిహారిక.. మెగా అభిమానులకు షాక్..!

Mon, 05 Aug 2024-12:47 pm,

తెలుగు సినీ ఇండస్ట్రీలో నట వారసులు ఎందరో ఉన్నారు. నందమూరి కుటుంబం, ఘట్టమనేని కుటుంబం, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ.. ఇలా సినీ ఇండస్ట్రీ లెజెండరీ ఫ్యామిలీస్ నుంచి స్టార్ హీరోలు ఎందరో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 

అయితే ఈ ఫ్యామిలీస్ నుంచి హీరోయిన్లుగా అమ్మాయిలు రావడం చాలా అరుదు. అప్పట్లో ఘట్టమనేని కృష్ణ వారసురాలిగా మంజుల ఇండస్ట్రీలో హీరోయిన్ గా.. రావడానికి ప్రయత్నించారు. మంచు ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఈ ఇద్దరు ఊహించిన రీతిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. ఇక వీరిని ఫాలో అవుతూ మెగా డాటర్ నిహారిక కూడా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.   

నాగశౌర్యతో కలిసి.. ఒక మనసు అనే సినిమాతో.. ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆ మూవీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. కానీ నిహారిక మాత్రం పట్టు విడవకుండా గట్టిగానే ప్రయత్నిస్తూనే ఉంది.  ఇండస్ట్రీలో ఎలాగైనా నిలబడాలి అనే ఉద్దేశంతో హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినా.. నిర్మాతగా సక్సెస్ అయ్యి చూపిస్తానని అంటోంది. 

అందులో భాగంగానే ఆమె పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై తాజాగా కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల.. ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో తెగ హడావిడి చేస్తోంది నిహారిక. త్వరలో చిత్రానికి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతోంది. మొదట్లో అందరూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నిహారిక తన కుటుంబంలో బడా హీరోలను పిలుస్తుంది అని భావించారు.   

మెగా హీరోలకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. మెగాస్టార్, పవర్ స్టార్ దగ్గర నుంచి గ్లోబల్ స్టార్ వరకు అందరూ ఆ ఫ్యామిలీలోనే ఉన్నారు. కానీ నిహారిక తన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా.. సినిమాను విడుదల చేసి.. హిట్ సాధించి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అని భావిస్తోందట.

ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా హీరోలను కాదు అని అక్కినేని హీరో వెనక పడుతోందట.కమిటీ కుర్రోళ్ళు మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని హీరో నాగచైతన్య రాబోతున్నాడని టాక్. తండేల్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న నాగచైతన్య.. నిహారిక కోరిక మేరకు ఈవెంట్ కు వస్తాడా లేదా అనేది పెద్ద హోట్ టాపిక్ గా మారింది. మెగా హీరోలను కాదు అని అక్కినేని హీరోను నిహారిక.. ఆహ్వానించాలి అనుకోవడం పై పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి వీటిపై నిహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link