Sai Dharam Tej: మెహరీన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన సాయి ధరమ్ తేజ్
మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ..ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో.. తన సినిమాల కన్నా కూడా పర్సనల్ లైఫ్ విషయాల ద్వారా.. ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ, వినిపిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా ఈ మధ్య సాయిధరమ్ తేజ్ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. మేగా కుటుంబానికి చెందిన ఈ హీరో, టాలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, నక్షత్రం, జవాన్, చిత్రలహరి వంటి సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన…సాయిధరమ్ తేజ్, ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులలో సైతం నటిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో.. సాయిధరమ్ తేజ్ పెళ్లి సంబంధమైన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ మేహ్రీన్‌తో.. సాయి ధరమ్ తేజ్.. లవ్ రిలేషన్ లో ఉన్నాడనే ఊహాగానాలు వినిపించాయి. ఇద్దరు జవాన్ సినిమా షూటింగ్ లో కలిసి పనిచేసిన తర్వాత, వారి మిత్రత్వం ప్రేమగా మారిందని.. కొన్ని వెబ్‌సైట్లు ప్రచారం చేశాయి. కానీ..సాయిధరమ్ తేజ్ టీమ్ ఈ వార్తలను ఖండిస్తూ.. ఇలాంటి రూమర్లు నిజం కాదని స్పష్టం చేసింది.
ఈ వార్తల మధ్య, సాయిధరమ్ తేజ్ తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో వివాహం పై క్లారిటీ ఇచ్చారు. హ్యాపీ సింగిల్స్ డే.. అని పోస్ట్ చేసిన ఆయన, వివాహం గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆలోచనలు లేవని చెప్పాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఇక ఈ పోస్టుతో మొన్నటి వరకు త్వరలోనే సాయి ధరంతేజ్ పెళ్లి ఉండబోతోంది అనే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.
ఈ విధంగా, సాయిధరమ్ తేజ్ వివాహం గురించి ప్రస్తుతానికి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో.. దాదాపు నాలుగు పదుల వయసు త్వరలోనే రాబోతున్న ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానుల్లో సైతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.