ఈ మెగాస్టార్ ఆ చిరంజీవికి ‘మెగా’ అభిమాని

Wed, 08 Apr 2020-8:56 am,

నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయస్వామి అంటే తనకు ఎందుకంత ఇష్టమో, ఆయనతో తన అనుబంధం అంటూ ఆ చిరంజీవి (ఆంజనేయస్వామి) విషయాల్ని ఈ మెగాస్టార్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా ఏలుతున్న చిరంజీవికి ఆంజనేయస్వామి అంటే చెప్పలేనంత ఇష్టం. కొణిదెల శివశంకర వరప్రసాద్ సినిమాల్లోకి వచ్చాక చిరంజీవిగా పేరు మార్చుకున్నారు. మెగాస్టార్ షేర్ చేసుకున్న ఆ ఆసక్తికర విషయాలు ఇక్కడ అందిస్తున్నాం.

ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?...అని ట్వీట్లు మొదలుపెట్టారు మెగాస్టార్.

ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో.. అని చిరంజీవి ట్వీట్ చేశారు.

కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …?

బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది...#8thApril ...to be continued.

(All Images Credit/Twitter/@KChiruTweets) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link