Megastar Chiranjeevi: చిరంజీవి పెళ్లి ఆహ్వాన పత్రిక చూశారా..! 40 ఏళ్ల క్రితమే ఓ రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ డిజైన్
తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి క్రేజ్ గురించి అప్పట్లోనే పాన్ ఇండియా వైడ్‌గా చర్చించుకునేవాళ్లు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ట తరం తరువాత మొదట చెప్పుకునేది మెగాస్టార్ చిరంజీవి గురించే. మన దేశంలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి నటుడు మెగాస్టారే కావడం విశేషం.
69 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో అలరిస్తున్నారు. వయసు పెరుగుతున్నా.. మెగాస్టార్‌లో మాత్రం గ్రేస్ తగ్గలేదు.
చిరంజీవి డ్యాన్స్ స్టెప్పులు ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కేలా చేశాయి. కొన్ని వందల పాటలకు తనదైన శైలిలో డ్యాన్స్‌తో అలరించారు.
అల్లు రామలింగయ్య కూతురు సురేఖకు మెగాస్టార్ చిరంజీవికి 1980 ఫిబ్రవరి 20న వివాహాం జరిగింది. అప్పట్లో చాలా బిజీ షెడ్యూల్ మధ్య కేవలం మూడు రోజులు షూటింగ్‌కు విరామం తీసుకుని పెళ్లి చేసుకున్నారు.
చిరంజీవి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహ్వాన పత్రికలో చిరంజీవి పెద్ద పూల మాల వేసి ఉన్న ఫోటోను ముద్రించారు.
40 ఏళ్ల క్రితమే మెగాస్టార్ డిజైన్ ఓ రేంజ్‌లో నెటిజన్లు అంటున్నారు. ఈ వెడ్డింగ్ కార్డును మెగా అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
ఇక త్వరలో విశ్వంభర మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు మెగాస్టార్. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.