Megha Akash: అబ్బాయిలను మాయ చేస్తున్న మేఘా…ఫోటోలతో ప్రేమలో దింపుతున్న నటి

Mon, 05 Feb 2024-9:22 pm,

Megha Akash Instagram Pics: నితిన్ హీరోగా చేసిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మేఘా ఆకాష్. ఆ తరువాత నితిన్ సరసన చల్ మోహనరంగా సినిమాలో సైతం కనిపించింది. 

చూడడానికి అచ్చం తెలుగమ్మాయిలానే ఉండే ఈ నటి స్వస్థలం తమిళనాడు. తెలుగు సినిమాలతో పాటు ఎన్నో తమిళ సినిమాలలో కూడా కనిపించి మెప్పించింది మేఘా.

ముఖ్యంగా ఈ హీరోయిన్ తెలుగులో నటించిన రాజరాజ చోరా, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఈ మధ్యనే రవితేజ రావణాసుర సినిమాలో సైతం కనిపించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో అందమైన గాగ్రా వేసుకొని ఇచ్చిన ఫోజులు ఆమె అభిమానులను తెగ అలరిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link