Mehreen Kaur: ఘాటు ఫోజులతో మరింత అందంగా మెహ్రీన్ కౌర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
మెహ్రీన్ కౌర్ హీరోయిన్ కాకముందు మోడల్ గా పనిచేసింది. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.
చేసిన తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ లలో మెహ్రీన్ కౌర్ ఒకరు. ఫస్ట్ మూవీ హిట్ తో ఈ భామకు వరుస అవకాశాలు ఆమెను వరించాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' మూవీతో వరుసగా రెండో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది మెహ్రీన్ కౌర్.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'F2' మూవీలో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరి నటనను ఎవరు మరిచిపోలేదు.
అప్పట్లో హర్యాణ మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత నిశ్చితార్ధం కాన్సిల్ అయింది.
ఎఫ్ 2 (F2) మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'ఎఫ్ 3 (F3)' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించినా.. ఈ అమ్మడికి మాత్రం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.