Video Game Benefit: వీడియో గేమ్స్ ఆడటం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Wed, 18 Nov 2020-8:02 pm,

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుల టీమ్ వీడియో గేమ్స్ ఆడటం వల్ల ఏం జరుగుతుందో చెప్పేందుకు ప్రయత్నించింది. 

వీడియో గేమ్స్ ఆడటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది అని  అంటున్నారు వారు.  

కరోనావైరస్ వల్ల చాలా మంది ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. ప్రజా జీవితం దాదాపు నిలిచిపోయింది. ఈ సమయంలో చాలా మంది వీడియో గేమ్స్ లేదా ఓటీటీపై బిజీగా ఉన్నారు. దాని ఫలితంగా వీడియో గేమ్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. 

Plants vs Zombies: Battle for Neighborville తో పాటు Animal Crossing: New Horizons అనే గేమ్స్ ఆడిన వారిని పరిశోధకులు గమనించారు.

గేమ్ తయారీదారులు అయిన ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, నింటెండో అందించిన డాటాను వారు గమనించారు. దాన్ని బట్టి గేమ్స్ ఆడిన వారిలో పాజిటీవ్ యాటిట్యూడ్ పెరిగినట్టు తెలిపారు పరిశోధకులు.

 ఆక్స్ ఫర్డ్ పరిశోధనలో తేలిన విషయం కుర్రకారులో కాస్త హుషారు కలిగించే విధంగా ఉంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link