Microsoft New Office with Taj Mahal look: తాజ్‌మహల్‌ను ప్రతిబింబిస్తున్న నోయిడా మైక్రోసాఫ్ట్ ఆఫీసు
తాజ్‌మహల్ స్ఫూర్తిగా తీసుకోవడం వెనుక చాలా కీలకమైన ఉద్దేశ్యముందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. స్థానిక వనరులు, స్థానిక సామగ్రి ఉపయోగం ప్రధాన ఆలోచన అని సంస్థ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ నోయిడా ఫెసిలిటీలో ఆర్‌అండ్‌డీ పని జరుగుతుంది. కొత్త టెక్నాలజీ ఆధారిత బిజినెస్ స్ట్రాటెజీపై ఇక్కడ పని జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్, గేమింగ్‌పై దృష్టి సారిస్తారు.
మైక్రోసాఫ్ట్ ఈ కార్యాలయంలోపలి భాగంలో తాజ్‌మహల్ అతిపెద్ద ఫోటో ఉంది. లోపలంతా తాజ్‌మహల్‌లానే డిజైన్ చేశారు. బిల్డింగ్ మొత్తం ఈకో ఫ్రెండ్లీ నిర్మాణం కావడం విశేషం.
నోయిడాలో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఎన్సీఆర్‌ను మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. దేశంలో మూడవ రీసెర్చ్ సెంటర్ ఇది. హైదరాబాద్, బెంగళూరులో ఇప్పటికే రెండు సెంటర్లున్నాయి. నోయిడా బిల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే..ఈ బిల్డింగ్ డిజైన్ తాజ్‌మహల్‌ను ప్రతిబింబించేలా నిర్మించారు.
ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ నోయిడాలో కొత్తగా రీసెర్చ్ సెంటర్ ప్రారంభించింది. తాజ్‌మహల్‌ను ప్రేరణగా తీసుకుని అదే విధంగా ఈ బిల్డింగ్ నిర్మించారు. ఈ కొత్త సెంటర్‌లో మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా రీసెర్చ్‌పై పని చేస్తుంది. ఇండియాలో ఇది మూడవ సెంటర్.