Naga Srinu: మోహన్ బాబు కుటుంబంపై నాగశ్రీను ఆరోపణల్లో నిజమెంత, ఆ ఫోటోలు ఏం చెబుతున్నాయి.
ఇక మంచు విష్ణు, సినీ నటి కాజోల్‌తో నాగశ్రీను సాన్నిహిత్యంగా ఉన్న ఫోటో కూడా ఇదే చెబుతోంది. అటు బాలయ్య, మోహన్ బాబుతో కూడా నాగశ్రీను ఫోటో స్పష్టంగా ఉంది. గ్రూప్ ఫోటోలు దిగేంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు అతని ఆరోపణలన్నీ అబద్ధాలేనా అని కామెంట్లు వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో మోహన్ బాబు కుటుంబం విడుదలే చేసిన ఫోటోలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఫోటోల్లో మోహన్ బాబు, మంచు విష్ణు స్వయంగా నాగశ్రీను బర్త్‌డే సెలెబ్రేషన్ కేక్ కట్ చేసి తిన్పిస్తున్నారు. ఎప్పుడూ మనిషిగా చూడలేదన్న నాగశ్రీను ఆరోపణ..ఈ ఫోటోతో నిజం కాదని చెప్పవచ్చా..అనే వాదన విన్పిస్తోంది.
ఈ వ్యవహారం మీడియాలో రచ్చైంది. మరోసారి మోహన్ బాబు కుటుంబంపై వివాదం రేగింది. అప్పటికే పలు విధాలుగా ట్రోలింగ్‌కు గురైన ఆ కుటుంబానికి మరో ఇబ్బంది ఎదురైంది.
మంచు విష్ణు, మోహన్ బాబు కుటుంబంపై తీవ్ర ఆరోపణలొస్తున్నాయి. మోహన్ బాబు వద్ద ఏళ్ల తరబడి హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసిన వ్యక్తి నాగశ్రీను వ్యవహారమిది. 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ మెటీరియల్ నాగశ్రీను దొంగిలించారంటూ మోహన్ బాబు కుటుంబం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. తనను ఎప్పుడూ దుర్భాషలాడేవారని..ఎప్పుడూ మనిషిగా చూడలేదని ఇలా చాలా ఆరోపణలు చేశాడు నాగశ్రీను. మోకాలిపై కూర్చోబెట్టి అతని తల్లిని సైతం అవమానించారనేది నాగశ్రీను ఆరోపణ.