Most Expensive Banana: రూ.52 కోట్ల అరటి పండు చూశారా?.. ఇది చూడని వారి కోసం!
ఈ అరటి పండుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోడకు అంటించి ఉన్న చిన్న అరటి పండుకు వేలం వెయ్యగా.. ఓ వ్యక్తి దాదాపు రూ.52 కోట్లకు ఈ అరటి పండును సొంతం చేసుకున్నాడు.
ఇలా రూ.52 కోట్లకు అరటి పండు అమ్ముడు పోవడం ఇప్పుడూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. న్యూయార్క్‌లో ఇటీవలే జరిగిన ఆర్ట్ వేలంలో భాగంగా ఓ మిలియనిర్ ఈ ఆరటి పండు ఆర్ట్‌ను కొనుగోలు చేశాడు.
బనానా టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది రూ.52 కోట్ల పాటు పలకడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. దీనిని ప్రముఖ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించిగా.. ఓ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది.
దీనిని ఇటాలియన్ ఆర్టిస్ట్ మొదట 2019 సంవత్సరంలో ఆర్ట్ వర్క్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఆర్ట్‌లో ఉండే బనానాను ప్రతి మూడు రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది.
2019లో జరిగిన వేలంలో భాగంగా ఈ బనానా ఆర్ట్‌కి ఎవ్వరూ ఊహించని స్థాయిలో విక్రయించగా.. 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఆర్ట్‌పై వేలాన్ని నిర్వహించగా దాదాపు రూ.98 లక్షలకు విక్రమైంది.