Highest Player of the Match Winners in IPL: `అత్యధిక సార్లు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్` అవార్డులు అందుకున్న టాప్-5 ప్లేయర్లు వీళ్లే..!

Wed, 24 May 2023-10:45 pm,

మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. ధోని మాదిరే టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడిగా నిలిచాడు. డివిలియర్స్ 25 మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  అవార్డులు అందుకుని.. టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.  ఐపీఎల్‌ కెరీర్‌లో 170 ఇన్నింగ్స్‌లలో 5162 పరుగులు చేశాడు. స్టైక్ రేట్ 151.68గా ఉంది. నవంబర్ 2021లో అన్ని రకాల ఫార్మాట్లకు డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు.  

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను ఊర్రుతలూగించాడు. గేల్ 22 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  అవార్డులను గెలుచుకున్నాడు. 148.96 స్ట్రైక్ రేట్‌తో గేల్ ఐపీఎల్‌లో 4965 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 6 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు బాదాడు.  

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. 19 మ్యాచ్‌లలో మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హిట్ మ్యాన్ ఐదు టైటిళ్ల‌ను అందించాడు. 30.15 సగటు, 139.63 స్ట్రైక్ రేట్‌తో ఐపీఎల్‌లో 5880 పరుగులు చేశాడు.  

ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. వార్నర్ ఇప్పటివరకు 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వార్నర్ 2016 సీజన్‌లో టైటిల్ అందించాడు. ఐపీఎల్‌లో 140.92 స్ట్రైక్ రేట్, 42.23 సగటుతో 6090 పరుగులు చేశాడు. లీగ్ చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన ప్లేయర్లలో వార్నర్ టాప్ ప్లేస్‌లో ఉండడం విశేషం.   

ఐపీఎల్‌లో 220 మ్యాచ్‌లు ఆడిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని.. 39.55 సగటు 135.83 స్ట్రైక్ రేట్‌తో 4746 పరుగుల చేశాడు. ఫినిషర్‌గా ధోని చెన్నైను ఎన్నో మ్యాచ్‌లను విజయ తీరాలకు చేర్చాడు. ఐపీఎల్‌లో ధోని 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. ఆల్-టైమ్ లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. ధోని కెప్టెన్సీలో 2010, 2011, 2018, 2021 చెన్నై ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఈసారి కూడా ఫైనల్‌కు చేరింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link