Pak TV Serials: ఇండియాలో విశేష ఆదరణ పొందుతున్న టాప్ 5 పాకిస్తానీ టీవీ సీరియల్స్ ఇవే
జిందగీ గుల్జార్ హై
ఫవాద్ ఖాన్ సీరియల్ ఇది. భారతీయుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఓ మహిళ ఆదారిత కధ ఇది. ఈ రొమాంటిక్ సీరియల్‌కు పాకిస్తాన్‌తో పాటు ఇండియాలో కూడా భారీగా వీక్షకులు ఉన్నారు.
సునో చందా
కామెడీ, ప్రేమ, ఎమోషన్లు ఈ సీరియల్‌లో కావల్సినంతగా లభిస్తాయి. ఓ ఉమ్మడి కుటుంబం ఏ విధంగా సుఖ దుఖాల్లో తోడుగా ఉంటారో అదంతా సీరియల్ లో ఉంది. పాకిస్తాన్‌లోనే కాదు..ఇండియాలో కూడా ఈ సీరియల్‌కు ఆదరణ పెరుగుతోంది.
సంగ్ ఎ మాహ్
ఈ సీరియల్‌లో ఆతిక్ అస్లం లీడ్ రోల్‌లో కన్పిస్తాడు. ఆదివాసీ కుటుంబాల కధ ఆధారంగా తెరకెక్కిన సీరియల్ ఇది. ఆధునిక యుగం పోకడలు, విధి విధానాల పేరుతో చాలా పోగొట్టుకుంటారు. స్టోరీ లైన్ చాలా స్ట్రాంగ్ కావడంతో బాగా ఆకట్టుకుంటోంది.
ఇష్క్ జలేబీ
కామెడీ, రోమాన్స్‌కు అద్భుతమైన కాంబినేషన్ సీరియల్ ఇది. ఈ పాకిస్తాన్ సీరియల్‌కు ఇండియాలో చాలా క్రేజ్ పెరుగుతోంది. ఈ షోను యూట్యూబ్‌లో ఉచితంగా చూడవచ్చు.
చుప్కే చుప్కే
ఈ పాకిస్తానీ డ్రామా షోలో ఓ కపుల్ కధ ఇది. ఈ ఇద్దరూ రోజూ కొత్త సవాళ్లు ఎదుర్కొంటుంటారు. 5 ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతోంది.